కోర్టు కేసుల నుండి త్వరగా బయటపడాలంటే

కోర్టు కేసుల సమస్యల నుంచి తొందరగా బయటపడాలి అంటే ఈ విధానం చాలా బాగా పనిచేస్తుంది.ఈ యొక్క తంత్రము చాలా పురాతనమైనది చాలామంది కోర్టు కేసుల నుంచి బయటపడినారు.

ఉదయం లేవగానే తలంటు స్నానం చేసుకుని ఉతికినటువంటి శుభ్రమైన పొడి దుస్తులను ధరించాలి.ఎవరితో మాట్లాడకుండా ఒక దోసెడు ఆకుపచ్చ శనగలు తీసుకుని ఏదైనా చెరువు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్లి అక్కడ మీ కోరికను లేదా సమస్యను సంకల్పం మనసులో తలుచుకుని మీ చేతులతో ఆకుపచ్చ శనగలు ఆ నీటిలో వదలండి. ఈ విధంగా 16 రోజులు క్రమం తప్పకుండా చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి ఇంటి పైకప్పు మీద ఉంచండి.ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారు అతి తొందరగా శీఘ్రముగా కోర్టుకేసుల నుంచి బయటపడతారు.ఈ తంత్రాన్ని ఆచరించే ముందు ఇష్టదైవాన్ని నామస్మరణ చేయడం మర్చిపోవద్దు కనీసం రోజుల్లో 108 సార్లు జపం చేసుకోవాలి.